తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కి.మీ మేర భక్తులు దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 98వేల 44 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 60 వేల 478 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 20 లక్షలు.
తిరుమలకు పోటెత్తిన భక్తులు - tirupati
తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్ని రద్దీగా మారాయి. స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
తిరుమల