ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాస్త్రోక్తంగా శ్రీవారి సహస్రకలశాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలోని సహస్రకలశాభిషేకం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా ఈ వేడుకను జరిపారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ఆదివారం రోజు ఈ ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

Srivari Temple
శ్రీవారి ఆలయం

By

Published : Jun 20, 2021, 3:11 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో సహస్రకలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా జ్యేష్ఠమాసంలో ఆదివారం రోజు ఈ ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని 'కౌతుకమూర్తి' అని, శ్రీ 'మనవాళపెరుమాళ్‌' అని కూడా పిలుస్తారు. ఈయన భోగ శ్రీనివాసమూర్తి. శంఖు, చక్రధారియై, చతుర్భుజుడైన ఈ భోగమూర్తిని మూలవిరాట్‌నకు ప్రతిరూపంగా భావిస్తారు. ఒకటిన్నర అడుగుల ఎత్తున్న ఈ వెండి విగ్రహాన్ని 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై బహూకరించారు. స్వామివారి మూలమూర్తి పాదాల ముందు ఈ విగ్రహం ఉంటుంది. భోగశ్రీనివాసమూర్తికి ప్రతి రోజు ఉదయం ఆకాశగంగ తీర్థంతో అభిషేకం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం బంగారువాకిలి ముందు సహస్రకలశాభిషేకం చేస్తారు. ప్రతి రోజు రాత్రి ఏకాంత సేవ (పవ్వళింపు సేవ) జరిగేది భోగశ్రీనివాసుడికే.

ABOUT THE AUTHOR

...view details