రెండు రోజులు పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవారి దర్శనానంతరం.. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలను, జ్ఞాపికలను ఆమెకు అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో తెలంగాణ గవర్నర్ - శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్నిదర్శించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించారు. కరోనా మహమ్మారి నివారణ కావాలని దేవుడిని ప్రార్థించినట్టు ఆమె తెలిపారు.
శ్రీకాళహస్తీస్వరుని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
కరోనా నివారణకు వ్యాక్సిన్ రావడం ఆనందంగా ఉందని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో కరోనా నివారణ కావాలని పరమశివుని ప్రార్థించినట్టు తెలిపారు. కరోనా నివారణ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి:తిరుమల వైకుంఠనాథుని సేవలో ప్రముఖులు
Last Updated : Jan 24, 2021, 4:02 PM IST