చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక తెదేపా నేతలు ధర్నా చేశారు. స్కిట్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తెదేపా హయాంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా గత 15 ఏళ్ల కిందట నిర్మించిన కళాశాలలో వేలాది మంది పేద విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారని గుర్తుచేశారు. అయితే వైకాపా అధికారంలోకి రాగానే స్కిట్ కళాశాల మూతపడిందని అన్నారు. కళాశాలను శాశ్వతంగా మూత వేసేందుకు వైకాపా పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కళాశాలను పునః ప్రారంభించి పూర్వవైభవం తీసుకురావాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
TDP protest: స్కిట్ కళాశాల ఎదుట తెదేపా నేతలు ధర్నా - స్కిట్ కళాశాల ఎదుట తెదేపా నేతలు ధర్నా
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న స్కీట్ కళాశాలను మూసివేయవద్దని స్థానిక తేదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. స్కిట్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
TDP protest