రాష్ట్ర సరిహద్దులో గొయ్యి తవ్విన తమిళ అధికారులు - చిత్తూరు వార్తలు
11:15 May 06
చిత్తూరు సరిహద్దుల్లో గొయ్యి తవ్విన తమిళ అధికారులు
చిత్తూరు సరిహద్దుల్లో తమిళ అధికారులు రహదారికి అడ్డంగా గొయ్యి తవ్వారు. తమిళనాడులోని ఊత్తుకోటలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిషేధిస్తూ... ఆంధ్ర- తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డంగా తమిళ అధికారులు భారీ గొయ్యి తవ్వారు. ఏపీ ప్రజలు ఎవరు తమ రాష్ట్రంలోకి రాకూడదంటూ...తమిళనాడు పోలీసులు గుంతలు తవ్వారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద చోటుచేసుకుంది. గతంలో రోడ్డుకడ్డంగా గోడ కట్టారు తమిళ అధికారులు. ఈ విషయంపై స్పందించిన చిత్తూరు అధికారులు గోడ కూల్చేశారు.
ఇవీ చదవండి...ఆమె కరోనాను జయించింది.. కానీ..!