ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డా.అనితారాణి వ్యవహారంపై సీఐడీ విచారణ

వైద్యురాలు అనితారాణిపై వైకాపా నేతల వేధింపులపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది. చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న తనను వైకాపా నేతలు వేధించారని.. గదిలో బంధించారని అనితారాణి ఆరోపించారు. అనితారాణి తన వేదన చెప్పుకున్న కాల్​ రికార్డింగ్ వైరల్ కావడం వల్ల ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

డా.అనితారాణి వ్యవహారంపై  సీఐడీ విచారణ
డా.అనితారాణి వ్యవహారంపై సీఐడీ విచారణ

By

Published : Jun 8, 2020, 9:13 PM IST

చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు అనితారాణిని వైకాపా కార్యకర్తలు వేధించారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన కాల్​ రికార్డింగ్స్​పై ప్రభుత్వం స్పందించింది. మార్చి 22న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తోన్న తనను వైకాపా నేతలు గదిలో బంధించి.. దుర్భాషలాడారని డా.అనితారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును పట్టించుకోలేదని వైద్యురాలు అనితారాణి.. తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో ఫోన్​లో చెప్పారు. వైద్యురాలు తన ఆవేదన చెప్పుకున్న కాల్​ రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అనితారాణి సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని సీఐడీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details