ఆపత్కాలంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని... ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ఈ సమయంలో కూడా చంద్రబాబు విమర్శలు చేయడం తగదని హితవుపలికారు. రాష్ట్రంలో అక్రమ మద్యం బయటపడిన చోట్ల తెదేపా నాయకుల హస్తం ఉందని ఆరోపించారు.
'ఆపత్కాలంలో సేవా కార్యక్రమాలు అభినందనీయం' - corona latest news
చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో వైకాపా రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వేలుమలై, ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు.
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి