శని త్రయోదశి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి తరలివచ్చారు. రాహు, కేతు సర్ప దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. శనీశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంభికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తజనసంద్రంగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలను అందించారు.
శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శని త్రయోదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో రాహుకేతు పూజలు నిర్వహించారు.
శనిత్రయోదశి
Last Updated : Jun 15, 2019, 11:30 PM IST