కరోనా కారణంగా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలంటూ ప్రజల్లో అవగాహనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహించింది. సుమారు 40 రకాల నోరూరించే జలచరాల వంటకాలను విద్యార్థులు తయారుచేశారు. సముద్రపు జీవన శైలిని తలపించేలా విద్యార్థులు జాలర్ల వేషం కట్టారు. నోరూరించే వంటకాలను నీలిరంగు వస్తువులతో అలంకరించారు. సీఫుడ్స్‌వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వివిధ అవయవాలకు బలం చేకూరుతుందన్నారు విద్యార్థులు.
తిరుపతి ఎస్‌ఐహెచ్‌ఎం కళాశాలలో సీఫుడ్ ఫెస్టివల్
కరోనా వైరస్‌తో పోరాడాలంటే ఏం చేయాలి..! రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.! శరీరానికి తగినన్ని విటమిన్లు, ప్రొటీన్లు అందించాలి.! ఈ సందేశంతోనే సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహించింది తిరుపతిలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల.
తిరుపతి ఎస్‌ఐహెచ్‌ఎం కళాశాలలో సీఫుడ్స్ ఫెస్టివల్
కరోనాతో మృతిచెందిన వారిలో ఎక్కువ శాతం విటమిన్ బీ12 లోపం వల్లే మరణిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయన్నారు నిర్వాహకులు. మాంసాహార ప్రియులు సీఫుడ్స్‌ని ఆహారంలో తీసుకోవడం ద్వారా విటమిన్లు అందుతాయన్నారు. సీఫుడ్స్‌లో రకాలు, సంప్రదాయ పద్ధతుల్లో వాటిని తయారు చేసే విధానాలను విద్యార్థులు ప్రదర్శనలో తెలియజేశారు.
ఇదీ చదవండి