చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి.. రూ.50 లక్షల విలువైన వెయ్యి 33 కేజీల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు-పుత్తూరు మార్గంలో వాహనాలను గంగాధరనెల్లూరు పోలీసులు తనిఖీలు నిర్వహింస్తుండగా.. అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని తిరుపతి చెందిన రాజేష్, తమిళనాడుకు చెందిన సుకుమార్, హేమకుమార్‌గా విచారణలో తెలిందని డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపారు.
Red Sandal: చిత్తూరు-పుత్తూరు మార్గంలో భారీగా ఎర్రచందనం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
Red Sandal: ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొనసాగుతూనే ఉంది. ఎంతో విలువైన కలపను దుండగులు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా కట్టడికి అధికారులు నిత్యం తనిఖీలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురుని పట్టుకున్నారు.
Red sandal
ఈ నెల 22న గంగాధర నెల్లూరు మండలంలోని కట్టకిందపల్లిలో వాహనాల తనిఖీ చేస్తుండగా వేగంగా వస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆ వాహనం అతివేగంగా వెళ్లడంతో బోల్తా పడింది. ఆ వాహనం నుంచి పారిపోయిన ముగ్గురూ వీరేనని పోలీసులు తెలిపారు.
Last Updated : Mar 26, 2022, 1:20 PM IST