తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తిరుపతి శాఖ కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యఅతిథిగా వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ హాజరయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రవిశంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం అందుకున్నారు. ప్రకృతితో మమేకమయ్యే.. మనిషి జీవితం ముందుకు సాగాలని రవిశంకర్ సందేశమిచ్చారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవటంవల్లే... మనిషి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయన్నారు. ధ్యానం ద్వారా మెరుగైన ఏకాగ్రత...శాంతిని పొందవచ్చని సందేశమిచ్చారు.
ప్రకృతితో మమేకమయ్యే.. మనిషి జీవితం ముందుకు సాగాలి! - art of living
మనిషి శాంతి, సహనంతో జీవించినప్పుడే... ప్రపంచం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.
శ్రీశ్రీ రవిశంకర్