చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. నేటి నుంచి ప్రారంభం కావల్సిన ఎనిమిదో విడత రేషన్ పంపిణీపై ఈ ప్రభావం పడింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించే వరకూ పంపిణీని నిలిపివేస్తున్నట్లు డీలర్ల ప్రకటించారు. కరోనా కష్ట కాలంలోనూ తాము పేదలకు రేషన్ ఇచ్చామని గుర్తు చేస్తున్నారు.
ఏడు విడతలు పంపిణీ చేస్తే రెండు విడతలు మాత్రమే కమిషన్ ఇచ్చారంటున్నారు డీలర్లు. కరోనా రక్షణ పరికరాలు ఇవ్వకున్నా బాధ్యతతో పని చేశామని.. తమను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలి ముద్రల నిబంధన ఎత్తి వేయాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.