చిత్తూరు జిల్లా పాకాలలోని ఓ మెడికల్ షాప్లో విధులు నిర్వహిస్తున్న యువతితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతిని మార్గమధ్యలో అడ్డగించి అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని.. యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.
యువతిపై అత్యాచారయత్నం..యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు - chithore district latest news
చిత్తూరు జిల్లా పాకాలలో అమానవీయ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని.. యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
పాకాలలో యువతిపై అత్యాచారయత్నం