చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు మండలాభివృద్ది కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. క్షేత్ర సహాయకుడు చిన్నరాసు అవినీతికి పాల్పడినట్లు స్వయంగా ఒప్పుకున్నప్పటికీ అతనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చిన్నరాసును విధుల నుంచి తొలగించి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుని మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
'న్యాయం చేయకపోతే.. మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటాం' - పాలసముద్రంలో ఉపాధి కూలీల నిరసన
ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించి లబ్ధిదారులను మోసం చేసిన క్షేత్ర సహాయకుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు ఆందోళన చేశారు. చేతిలో పెట్రోల్ సీసాలతో నిరసన తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
పెట్రోలు సీసాలతో ఉపాధి కూలీల నిరసస