ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో ఏసు మందిరాలని తప్పుడు ప్రచారం, నిందితుల అరెస్టు

ఏడుకొండల్లో ఏసుమందిరాలంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

By

Published : Sep 6, 2019, 8:00 PM IST

Police have arrested three people who were promoting paganism in thirupati at chitturu

తిరుపతిలో ఏసు మందిరాలని తప్పుడు ప్రచారం, నిందితుల అరెస్టు

తిరుమల కొండల్లో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ సామాజికమాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.తిరుపతి కరకంబాడీ రోడ్ లో తిరుమల కొండపై ఉన్న అటవీశాఖ వాచ్ పోస్ట్ ను దూరం నుంచి తీసిన ఫోటోను,అరుణ్,కార్తీక్,అజితేశ్ అనే వ్యక్తులు చర్చిగా పేర్కొంటూ ప్రచారం చేస్తున్నారనన్నారని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.అటవీ శాఖ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ఓ స్తంభాన్ని ఏర్పాటు చేయగా,దాన్ని చూసి ఏడుకొండల్లో ఏసుమందిరాలు అంటూ ప్రచారం చేస్తున్నారనన్నారని వెల్లడించారు.నాలుగు బృందాలతో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు.తాము ఓ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details