చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్లలో ప్లెక్సీల ఏర్పాటుపై గొడవ జరిగింది. ఓ వర్గం వారిపై మరో వర్గం దాడులకు దిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదగొట్టారు. సీఐలు శివప్రసాద్, సురేంద్రరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘర్షణలో గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ప్లెక్సీల ఏర్పాటుపై వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ - pulipatla plex contreversy news
చిత్తూరు జిల్లాలో ప్లెక్సీల ఏర్పాటుపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్లెక్సీల ఏర్పాటుపై వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ