చిత్తూరుల జిల్లాలో పెట్రోలు వినియోగదారులను.. కొలతల్లో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ కు అందిన సమాచారం మేరకు చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలోని పారిశ్రామిక వాడలోని వెల్కమ్ భారత్ పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించారు. లీటరు పెట్రోలు కంటే 40 మిల్లీ లీటర్ల పరిమాణం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. పెట్రోల్ పంపు మిషన్ లోని కీప్యాడ్లు రెండు అమర్చి లీటరు పెట్రోలులో 40 మిల్లీ లీటర్లు తక్కువగా డిజిటల్ మీటర్లో చూపించే విధంగా అమర్చారు. ఈ మోసంపై తూనికలు, కొలతల శాఖ సహాయ కంట్రోలర్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పెట్రోలు బంకు మేనేజర్ వెంకట్రావును అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు.
చిన్నచిప్తో పెద్ద మోసం..పెట్రోల్ బంకుల నిర్వాకం - ఏపీ పెట్రోల్ బంకుల మోసం
అసలే పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే బంకులు మోసం చేస్తూనే ఉన్నాయి. పెట్రోల్ బంకుల మోసాలకు వినియోగదారులు బలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా.. రామచంద్రపురం పరిధిలోని ఇండియన్ ఆయిల్ బంక్‌లోనూ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ చిప్ ద్వారా ప్రతీ లీటరుకు 30 ఎంఎల్ పెట్రోల్ తక్కువ కొడుతున్నారని సమాచారం అందింది. జిల్లా ఎస్పీ నయీం ఆస్మీఆదేశాల మేరకు.. రామచంద్రపురం ఇండియన్ ఆయిల్ బంకుపై లీగల్ మెట్రాలజీ, పోలీసులు దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్ బాషా దగ్గర తప్పుడు రీడింగ్ చూపుతున్న కంప్యూటర్ చిప్‌ను బంకు యాజమాన్యం కోనుగోలు చేసినట్లు తెలిసింది.
కంప్యూటర్ చిప్ పరికరాలు స్వాధీనం చేసుకుని.. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:మళ్లీ 10 వేలకు పైగా కేసులు.. తాజాగా 10, 776 మందికి కరోనా