ఉక్కుపాదంతో అణిచివేసే వాళ్లకే వైకాపా నాయకులు భయపడతారు.నేటి రాజకీయాలకు అమిత్ షా లాంటి వ్యక్తులే సరిపోతారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను నియంత్రించటంపై మాట్లాడుతున్న సందర్భంగా...ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. జగన్ రెడ్డిని ఎప్పటికీ సీఎంగా గుర్తించలేనంటూ మండిపడ్డారు.ఆయన ప్రవర్తన,భాష సరిగా లేదని ఆక్షేపించారు. తిరుపతి పర్యటనలో భాగంగా పార్టీనేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన....రాష్ట్రంలో వైకాపా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. సీమలో తమ ఆధిపత్యమే కొనసాగలన్నట్లు వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని బదులిచ్చారు.
వైకాపా దౌర్జన్యాలను జనసైనికులు దీటుగా ఎదుర్కోవాలి
క్షేత్రస్థాయిలో సమస్యలు పార్టీని బలోపేతం చేసే దిశగా శ్రేణులు అవలంబిచాల్సిన విధివిధానాలను తెలియచేసే విధంగా కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమావేశమై...వైకాపా దౌర్జన్యాలను జనసైనికులు దీటుగా ఎదుర్కోవాలన్నారు. రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ పెట్టే విషయంలో తన అంతరంగాన్ని న్యాయవాదులతో పంచుకున్నారు.స్వతంత్ర భారతంలో రాజకీయ పార్టీని స్థాపించటం దుస్సాహసమేనన్నారు. చట్టాలను కాపాడాల్సిన ఎమ్మెల్యేలే టీవీల ముందు దుర్భాషలు ఆడుతుంటే...దుర్మార్గులు రోడ్లపై అత్యాచారాలకు పాల్పడక మరేం చేస్తారంటూ నిలదీశారు.
ఉల్లిపై పవన్ మండిపాటు