pagan-propaganda-in-tirupati తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో చెట్లపై అన్యమత చిహ్నాలు కలకలం రేపాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్లపై అన్యమత చిహ్నాల పెయింట్లు వేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు.
తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం స్పందించిన భద్రతాధికారి
చెట్లపై అన్యమత చిహ్నాలపై స్విమ్స్ ముఖ్య భద్రత పర్యవేక్షణాధికారి ఎలాంగోరెడ్డి స్పందించారు. డిసెంబర్ 31న రాత్రి ఘటన జరిగినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. వెంటనే చెట్లపై అన్యమత చిహ్నాలను తొలగించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని.. ఆ రోజు సిబ్బంది తక్కువగా ఉన్నారని అన్నారు. దీనిపై అలిపిరి పోలీసులకు సమాచారమిచ్చామన్న ఆయన.. అంతర్గత విచారణ చేపట్టినట్లు వివరించారు.
ఇదీ చూడండి:
పథకాలకు అనర్హులు 21 లక్షలు.. తేల్చిన నవశకం లెక్కలు