ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ - ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి - చిత్తూరు జిల్లా నేర వార్తలు

చిత్తూరు జిల్లా బీ. కొత్తకోట మండల పరిధిలోని శీలంవారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది.

one-man-died-in-a-road-accident-at-shilamvaripalli-guntur-district
ట్రాక్టర్-ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి

By

Published : Apr 8, 2021, 9:24 PM IST

చిత్తూరు జిల్లా బీ.కొత్తకోట మండలంలోని కోటిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన రాజన్న... రేషన్ బియ్యం కోసం శీలంవారిపల్లికి వచ్చాడు. రేషన్ బియ్యం తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా... ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి రాజన్న ప్రయాణిస్తున్న స్కూటర్​ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రాజన్న ట్రాక్టర్ ఇంజన్ కింద ఇరుక్కుని మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఇంటర్ చదువుతుండగా రెండో కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details