'శివనామస్మరణ'లో శ్రీకాళహస్తి - శ్రీకాళహస్తి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని రావణ బ్రహ్మ వాహనంపై స్కోమస్కంద మూర్తి, మయూరం వాహనంపై జ్ఞాన ప్రసూనాదేవి కొలువుదీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివ నామ స్మరణతో పట్టణం మార్మోగింది. శనివారం గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని తపోబల సంపన్నుడైన రావణబ్రహ్మపై స్కోమస్కంద మూర్తి, సొగసు సౌందర్యానికి ప్రతీక అయిన మయూరంపై జ్ఞాన ప్రసూనాదేవి కొలువుదీరారు. ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపకాంతుల నడుమ ఆది దంపతులు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు.