ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో నరబలి కలకలం - పలమనేరు క్షుద్రపూజలు

చిత్తూరు జిల్లాలో నరబలి కలకలం రేపింది. కాలిన గాయాలతో గణేశ్ అనే ఓ వ్యక్తి తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరాడు. గుప్త నిధుల కోసం గణేశ్​ను బలి ఇచ్చేందుకు కొందరు ప్రయత్నించారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Narabali Kalakalam in Chittoor District
Narabali Kalakalam in Chittoor District

By

Published : Feb 19, 2020, 9:33 PM IST

వివరాలు వెల్లడిస్తోన్న బాధితుడు

చిత్తూరు జిల్లా పలమనేరులో గణేశ్ అనే వ్యక్తిని నరబలి ఇచ్చేందుకు కొందరు ప్రయత్నించారని బంధువులు ఆరోపించారు. కాలిన గాయాలతో గణేశ్‌ తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరాడు. గుప్తనిధుల కోసమే గణేశ్​ను బలి ఇచ్చేందుకు యత్నించారని బంధువులు చెబుతున్నారు. బాధితుడు, బంధువులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 15న గణేశ్​ మరికొందరితో కలిసి ఓ అటవీ ప్రాంతానికి గుప్తనిధుల వేట కోసం వెళ్లాడు. వీరి వెంట ఓ స్వామీజీ కూడా ఉన్నాడు. కొంత దూరం వెళ్లాక గణేశ్​ను సృహతప్పి పోయేలా చేసి బలి ఇచ్చేందుకు యత్నించారు. ఏం జరిగిందో ఏమో కొంతసేపటికి వారే గణేశ్​ను తిరిగి ఇంటికి తరలించారు. తనకు ఏమైందని గణేశ్​ అడిగితే... కరెంట్ షాక్ తగిలిందని వారు చెప్పారు.

అక్కడ కరెంట్ తీగలు లేవు

ఈ గుప్తనిధుల వ్యవహారంపై అధికారులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. గణేశ్‌ ఒంటిపై విద్యుదాఘాతం ఆనవాళ్లు లేవని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఘటన జరిగిన చోట కరెంటు తీగలు లేవని చెబుతున్నారు. గాయాలు చూస్తే కత్తితో నరికినట్లు ఉందని ఫారెస్ట్ రేంజ్ అధికారి మదన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అయితే విద్యుత్ తీగలు తగలడం వల్లే గణేశ్‌ గాయపడ్డారని పలమనేరు ఎస్‌ఐ తెలిపారు. అధికారుల భిన్న ప్రకటనలతో గణేశ్‌ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసలు అడవిలో ఏం జరిగిందో తెలిస్తే కానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కిరాదు.

ఇదీ చదవండి:

పడుగుపాడులో క్షుద్రపూజల కలకలం

ABOUT THE AUTHOR

...view details