రీపోలింగ్ సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పులివర్తివారిపల్లిలో చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఇందులో భాగంగా తెదేపా అభ్యర్థి నాని పై కేసు నమోదయింది. ఇందుకు స్పందించిన ఆయన వైకాపా అభ్యర్థి చెవిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో 7చోట్ల రీపోలింగ్ నిర్వహించడం చంద్రగిరి నియోజకవర్గానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా, ఈసీలు... వైకాపాతో కుమ్మక్కై పన్నిన పన్నాగంలో భాగమే రీపోలింగ్ అని ఆక్షేపించారు. ఓటమి భయంతోనే తెదేపా బలమున్న చోట్ల రీపోలింగ్ జరిగేలా చేశారని ఆరోపించారు.
'తెదేపాకు బలమున్న చోట రీపోలింగ్ జరిగేలా కుట్ర'
ఓటమి భయంతోనే చంద్రగిరి రీపోలింగ్ జరిగేలా చేశారని తెదేపా అభ్యర్థి నాని ఆరోపించారు. తెదేపాకు బలమున్న చోట్ల భాజపా, వైకాపా, ఈసీలు కుమ్మక్కై రీపోలింగ్ జరిపించారన్నారు.
'తెదేపాకు బలమున్న చోట రీపోలింగ్ జరిగేలా కుట్ర'