చిత్తూరు జిల్లా కొత్తూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీ సమేత శ్రీ ధర్మరాజుల ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నగిరి ఎమ్మెల్యే రోజా ఉత్సవాల్లో పాల్గొని శ్రీ తిరుపతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్థానిక బజార్ వీధిలోని శ్రీ గణపతి ఆలయం నుంచి కాపు వీధి ద్వారా ఆలయానికి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజా - chitoor
చిత్తూరు జిల్లా శ్రీ ద్రౌపదీ సమేత శ్రీ ధర్మరాజుల ఆయలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించిన రోజా...