ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలంలో హత్య... కిలికిరిలో కలకలం... - చిత్తూరు జిల్లా, కలికిరి

చిత్తూరు జిల్లా కలికిరి దారుణ హత్య చోటు చేసుకుంది. తిర్నాల్లకు వెళ్లి ఇంటికి తిరుగుప్రయాణమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లాలో హత్య

By

Published : Jul 25, 2019, 2:49 PM IST

చిత్తూరు జిల్లాలో హత్య

చిత్తూరు జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కలికిరి మండలానికి చెందిన సుధా రామ్మూర్తి కుటుంబసమేతంగా గుట్ట పల్లెలోని బి.కొత్తకోటలో జరిగే తిరునాళ్లకు వెళ్లారు . సాయంత్రం తన భార్య పిల్లలను ఇంటికి పంపించి తాను ఆలస్యంగా వస్తానని చెప్పాడు. ఇంటికి వెళుతున్న సమయంలోనే మదనపల్లె పట్టణం గొల్లపల్లి బైపాస్ రోడ్ పక్కన ఉన్న పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి పరారయ్యారు. ఇంటికి వస్తానన్న వ్యక్తి ఇలా శవమై కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను చేదిస్తున్నారు. మదనపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ సంఘటనా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చూడండి: కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

ABOUT THE AUTHOR

...view details