ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వస్థలాలకు పంపాలని వలస కూలీల వేడుకోలు

చిత్తూరు జిల్లాలో చిక్కుకున్న వలస కూలీలు తమను సొంత రాష్ట్రాలకు పంపమని అధికారులను కోరుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వలస కార్మికులు తహసీల్దార్ కు తమ గోడును తెలియజేశారు. అధికారులు చెప్పేంత వరకూ తాము ఏం చేయలేమని ఎమ్మార్వో స్పష్టం చేశారు.

By

Published : May 8, 2020, 6:31 PM IST

mograte workers telling their problems to mro officer in chittoor dst thambalapalli
mograte workers telling their problems to mro officer in chittoor dst thambalapalli

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపాలని... కూలీలు మండల తహసీల్దార్ కు విన్నవించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నామని... క్వారీల్లో పనిచేసే కార్మికులు అడవుల్లోనే పూరి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని, విషపురుగుల బెడద ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల అనుమతులు వచ్చేవరకూ తామేని చేయలేమని తహసీల్దార్ స్పష్టం చేశారు.

తంబళ్లపల్లెలో 60, పెద్దమండ్యంలో 25, పెద్దతిప్ప సముద్రంలో 20, బి.కొత్తకోటలో 31, కురబలకోటలో 30కిపైగా వలస కార్మికులు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే వారిని పంపుతామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండిరక్షకులకు గొడుగులు అందించిన డీఎస్పీ

ABOUT THE AUTHOR

...view details