రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని భాజాపా శాసనమండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలను తిరుపతిలో తెలియజేశారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలపై వాకాటి నారాయణరెడ్డి స్పందించారు. తమది జాతీయపార్టీ అని... ప్రాంతీయ పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన పరిస్ధితుల్లో తాము లేమని పేర్కొన్నారు.
'ప్రజాభిప్రాయం మేరకే అమరావతిపై నిర్ణయం' - updates on amaravathi
రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని భాజపా ఎమ్మెల్సీ వాకాటీ నారాయణరెడ్డి అన్నారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలపై నారాయణ రెడ్డి స్పందించారు. స్థానిక పార్టీ నేతలతో సలహాలు తీసుకునే స్థితిలో లేమని వ్యాఖ్యానించారు.
అమరావతిపై వాకాటి నారాయణరెడ్డి