ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: రోజా - చిత్తూరు
చిత్తూరు జిల్లా పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చే కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 41 సంఘాలకు చెక్కులు అందజేశారు.
mla_roja_distribution_cheques
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని 41 స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల అరవై లక్షల 50 వేల రూపాయలు చెక్కులను నగరి ఎమ్మెల్యే రోజా అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతల్లో 22 వేల కోట్లు మాఫీ చేస్తామని రోజా తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు తెలిపారు.