చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కచరవేడులో 48 మంది లబ్ధిదారులకు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ సముదాయాలకు శంకుస్థాపన చేశారు. దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం జగన్ పేదలకు పెద్ద కొడుకుగా మారాడని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇళ్ల పంపిణీ, వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు...
సంక్రాంతి సందర్భంగా నగరి మున్సిపల్ కార్యాలయంలోని 95 మంది పారిశుద్ధ్య కార్మికులకు రోజా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది కులమతాలకు అతీతంగా, రాజకీయ వత్తిడులకు తలొగ్గకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని ఎమ్మెల్యే రోజా సూచించారు. ప్రతిఒక్కరూ నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. సీఎం జగన్ ఆలోచనలను అమలుచేయడానికి ప్రతి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం