చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో 'మహిళా సాధికారత' అనే అంశంపై గురువారం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారతకు లింగ వివక్ష అన్నది అడ్డంకిగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి లింగ వివక్షను తాను కూడా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, ముఖ్యమంత్రి ఇలా... ఎన్నో కీలకమైన పదవుల్లో మహిళలు తమ సత్తా ఏంటో నిరూపించారని తెలిపారు. ఏ రోజైతే మహిళలకు అవకాశాలు మగవారితో సమానంగా దక్కుతాయో... ఆ రోజే సమగ్రమైన మహిళా సాధికారత సాధించగలమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
'నేను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నా' - chittoor district latest news
తాను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పూత్తూరులో జరిగిన మహిళా సాధికారత జాతీయ స్థాయి సదస్సుకు ఆమె ముఖ్య అథిగా హాజరయ్యారు. ఆ సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
'నేను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నా'