సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజా వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ పేద విద్యార్థినిని ఆమె దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి తిరుపతి గర్ల్స్ హోమ్‌లో ఉంటున్న పుష్పకుమారి నీట్లో మంచి ర్యాంకు సాధించింది. ఆర్థిక స్తోమత లేని ఆ ఆడబిడ్డను మెడిసిన్ చదివించే బాధ్యత తీసుకున్నారు. ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని రోజా ఈ నిర్ణయం తీసుకోవటంపై అభినందనలు తెలుపుతున్నారు.
సీఎం జన్మదినం సందర్భంగా విద్యార్థినిని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే రోజా - mla roja latest news
తిరుపతి గర్ల్స్ హోంలోని ఓ విద్యార్థినిని నగరి ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆమె ఈ బాధ్యత స్వీకరించారు.
విద్యార్థినిని దత్తత తీసుకున్న ఎమ్మె