ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామ అభివృద్ధి కమిటీలో గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేయాలని... కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ కల్యాణి చదా సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల జిల్లాల కలెక్టర్లతో దిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
చిత్తూరు జిల్లాకు మొదటి దశలో 37, రెండవ దశలో ఈ పథకానికి 39 గ్రామాలు మంజూరు కాగా... వాటిలో 50 శాతం కన్నా ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలను గుర్తించామని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా తెలిపారు. జిల్లా అభివృద్ధి కమిటీలో 37 గ్రామాలలో 328 పనులు గుర్తించామని వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వివరించారు. రెండవ దశకు సంబంధించి గ్రామాల జాబితా జిల్లా అభివృద్ధి కమిటీలో ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు.