ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - ysrcp

Tirumala Darshan: తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆదిమూలం స్వామివారిని దర్శించుకున్నారు.

Tirumala darshana's
Tirumala darshana's

By

Published : Dec 30, 2021, 9:58 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆదిమూలం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న వీరికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ప్రవేశదర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను నారాయణస్వామి ఖండించారు. సోము వీర్రాజు తాగుబోతుల సంఘం అధ్యక్షుడయ్యాడా అంటూ విమర్శలు చేశారు.

నిన్న శ్రీవారిని 33,065 మంది భక్తులు దర్శించుకోగా.. 14,662 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు వచ్చినట్లు తితిదే అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

SOMU VEERRAJU: అన్నపూర్ణాంధ్రను.. అప్పుల ఆంధ్రగా మార్చారు: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details