..
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి - తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి వార్తలు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి... తిరుమాడ వీధులలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను పరిశీలించారు. వసతి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. చలి తీవ్రత దృష్టిలో ఉంచుకొని తితిదే దుప్పట్లను కూడా పంపిణీ చేస్తోందని మంత్రి తెలిపారు. గతేడాది కంటే ఈ సంవత్సరం తితిదే మెరుగైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా చూడాలని అధికారులకు సూచించారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి