ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్ర బడ్జెట్‌ బాగానే ఉంది కానీ...' - పోలవరం తాజా న్యూస్

రాష్ట్రాలని కలుపుకుని వెళ్లకపోతే.... ఎన్ని లక్షల రూపాయల బడ్జెటైనా క్షేత్రస్థాయిలో సంతృప్తినివ్వదని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పోలవరం, విభజన హామీలు అన్నింటిలోనూ కేంద్రం మొండిచెయ్యి చూపించందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి ఉన్న విశ్వసనీయతను... కేంద్రస్థాయిలో దెబ్బతినేలా చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

బడ్జెట్​పై స్పందించిన మంత్రి కన్నబాబు
బడ్జెట్​పై స్పందించిన మంత్రి కన్నబాబు

By

Published : Feb 3, 2020, 8:50 AM IST

బడ్జెట్​పై స్పందించిన మంత్రి కన్నబాబు

రాష్ట్రాలని కలుపుకుని వెళ్లకపోతే... ఎన్ని లక్షల రూపాయిల బడ్జెటైనా క్షేత్రస్థాయిలో సంతృప్తినివ్వదని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన తిరుపతి టౌన్ బ్యాంక్ శతవసంతాల వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేంద్ర బడ్జెట్​పై మంత్రి స్పందించారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే కేంద్ర బడ్జెట్ బాగానే ఉన్నా... రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులు మాత్రం నిరాశజనకంగా ఉన్నాయన్నారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని... కేంద్రం ఇలా విస్మరించటం తగదన్నారు. పోలవరం నుంచి విభజన హామీల వరకు అన్నింటిలోనూ కేంద్రం మొండిచెయ్యి చూపించందన్నారు. నిధులను రాబట్టడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు జవాబిచ్చిన మంత్రి.... గత ప్రభుత్వం రాష్ట్రానికి ఉన్న విశ్వసనీయతను కేంద్రస్థాయిలో దెబ్బతినేలా చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇదీ చూడండి:ఆశాజనకంగా ఉన్నా.. నిరాశే మిగిలింది: కన్నబాబు

ABOUT THE AUTHOR

...view details