ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి ఆళ్ల నాని - thirupathi padmavathi hospital incident

తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆందోళనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. కొవిడ్‌, బ్లాక్‌ఫంగస్‌కు సరైన వైద్యం అందలేదని రోగుల బంధువులు ఆందోళన చేయడంతో ఆస్పత్రిలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

Minister alla nani inquiry on thirupathi padmavathi hospital incident
కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి ఆళ్ల నాని

By

Published : Jun 13, 2021, 3:27 PM IST

తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో సరైన వైద్యం అందించకపోవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనపై వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని స్పందించారు. జరిగిన ఘటనపై డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్​లో మాట్లాడారు. కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోగుల బంధువులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని తిరుపతి ఆర్డీవోకు మంత్రి ఆదేశించారు. రోగులకు ఆహారం, శానిటేషన్ విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.

చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన 28 ఏళ్ల ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయారు. ఆక్సిజన్ సరఫరా లేక ఇబ్బందిపడుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని మృతుడి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. మరో ఘటనలో ఓ బ్లాక్ ఫంగస్‌ బాధితురాలు ఆసుపత్రిలోనే ఉరేసుకుని ఈ ఉదయం చనిపోయారు. ఈ రెండు ఘటనలతో కలకలం రేగింది. వీటిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని.. మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఇదీచదవండి.

తెలంగాణ సరిహద్దులో నిలిచిన వందల వాహనాలు.. ఈ-పాస్ లేకుంటే నో ఎంట్రీ!

ABOUT THE AUTHOR

...view details