ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వస్థలాలకు పశ్చిమబంగా వలస కూలీలు

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న పశ్చిమ బంగా రాష్ట్రానికి చెందిన వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు పంపించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 1,140 మంది కూలీలను శ్రామిక్ ​రైలులో స్వరాష్ట్రానికి తరలించారు.

స్వస్థలాలకు వలస కూలీలు
స్వస్థలాలకు వలస కూలీలు

By

Published : Jun 1, 2020, 7:56 AM IST

చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి పశ్చిమబంగా రాష్ట్రానికి చెందిన 1,140 మంది వలస కూలీలను జిల్లా అధికారులు ప్రత్యేక శ్రామిక రైలులో పంపించారు. చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రత్యేక బస్సుల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు వారికి భోజన వసతి కల్పించారు.

కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించి...పరీక్షల్లో నెగెటివ్ రావడంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రత్యేక రైలు సదుపాయాన్ని కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగ శైలజ, కొవిడ్ ప్రత్యేక అధికారి చంద్రమౌళి, ఆర్డీవో రేణుక తదితరులు వలస కూలీలకు వీడ్కోలు పలికారు.

ABOUT THE AUTHOR

...view details