ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవు గొంతులో మామిడి కాయ.. శస్త్రచికిత్సతో తొలగించిన వైద్యులు - tirupathi latest news

ఆవు గొంతులో మామిడికాయ ఇరుక్కుంది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. పశు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి దానిని తొలగించారు.

mango was stuck in the cow throat in tirupathi
mango was stuck in the cow throat in tirupathi

By

Published : Jul 6, 2021, 10:59 AM IST

పొరపాటున ఓ ఆవు గొంతులో మామిడి కాయ ఇరుక్కుంది. శ్రీవేంటేశ్వర పశువైద్య కళాశాల అధ్యాపకులు శస్త్ర చికిత్స నిర్వహించి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రావారిపాలెం మండలానికి చెందిన మహిధర్‌ పాడి ఆవు సోమవారం సాయంత్రం మేతకు వెళ్లి మామిడి కాయ తింది. అది అన్నవాహికలో ఇరుక్కోవడంతో పొట్ట ఉబ్బరంతో ప్రాణాపాయ స్థితికి చేరింది. బాధిత రైతు పశువును తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య కళాశాల ఆధునిక చికిత్స సముదాయానికి తరలించారు. అప్పటికే వైద్యులు వెళ్లిపోయారు. అక్కడి సిబ్బంది కళాశాల అధ్యాపకులకు సమాచారమిచ్చారు. పశువైద్య శస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ ఆర్వీ సురేష్‌కుమార్‌ రెండు గంటల పాటు శ్రమించి అత్యవసర శస్త్ర చికిత్స ద్వారా మామిడి కాయను తొలగించారు. డాక్టర్‌ గిరీష్‌, రేడియోగ్రాఫర్‌ విశ్వనాథరెడ్డి శస్త్రచికిత్సలో భాగస్వాములయ్యారు. రైతు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details