ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణ వైభోగమే...

శ్రీ కాళహస్తీశ్వరాలయంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈశ్వరుడు గజవాహనం.. అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి వివాహ వేదికకు చేరుకున్నారు. ఆది దంపతులతో పాటు వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటయ్యారు.

ఆదిదంపతుల వివాహ వేడుక

By

Published : Mar 7, 2019, 8:27 AM IST

Updated : Mar 7, 2019, 9:30 AM IST

ఆదిదంపతుల వివాహ వేడుక
శ్రీ కాళహస్తీశ్వరాలయంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈశ్వరుడు గజవాహనం..అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి వివాహ వేదికకు చేరుకున్నారు. చండికేశ్వర రాయబారంతో సోమస్కందమూర్తి ,శ్రీ జ్ఞానప్రసూనాంబ వివాహ వేడుకను ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా జరిపించారు. ఆది దంపతులతోపాటు వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటయ్యారు. ఆలయ ఈవో రామస్వామి వీరికి మంగళ సూత్రాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. వేలసంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంజన సంద్రంగా మారింది. భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Last Updated : Mar 7, 2019, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details