శ్రీవారి సన్నిధిలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు - gokulastami celebrations
కృష్ణాష్టమిని పురస్కరించుకుని తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలను నిర్వహించారు. కాళీయమర్థనునికి ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించి అందంగా అలంకరించారు.
తిరుమలలో గోకులాష్టమి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద వెలసిన కాళీయమర్థనునికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళం, చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. గోవర్థనునికి తలపాగా, ఉత్తరీయం, దోవతిలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.