ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్టును పట్టువస్త్రంతో పూర్తిగా కప్పివేశారు అర్చకులు. సుగంధద్రవ్యాలు కలిసిన పవిత్ర జలంతో ప్రదక్షిణంగా వెళ్లి ఆలయశుద్ధి చేశారు.

By

Published : Jul 16, 2019, 9:34 AM IST

ttd

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది.ఆణివార ఆస్థానంను పురస్కరించుకొని ఆలయశుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు.సుప్రభాతం,అర్చనసేవల తర్వాత మూలవిరాట్టుపై పట్టువస్త్రంతో పూర్తిగా కప్పివేసి సుగంధద్రవ్యాలు కలిసిన పవిత్ర జలంతో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ఆనందనిలయం,బంగారువాకిలి,ఉపదేవాలయాలు,ఆలయ ప్రాంగణం,పూజాసామాగ్రి వస్తువులను శుభ్రపరుస్తున్నారు. 11గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా,ప్రత్యేక పూజ,నైవేధ్యం సమర్పించాక12గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

చంద్రగ్రహణం వల్ల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న అధికారులు

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రాత్రి 7 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ కావడంతో.... సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం వరకు స్వామివారి దర్శనానికి అనుమతి నిలిపివేయనున్నారు. ఆలయంతో పాటు అన్నప్రసాద వితరణ, వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని మూసివేయనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details