ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ నెరవేరుస్తున్నాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు బయటపడతాయనే... ఇవాళ ఆయన సభకు రాలేదని ఆరోపించారు. గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో వెన్నుపోటు, చంద్రబాబు హయాంలో పన్నుపోటు చేశారంటూ యనమలపై వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను భ్రష్ఠు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే...యనమల స్టీరింగ్ అని విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించేలా పెద్దల సభ ఉండాలే తప్ప... ఆ తీర్పును అపహాస్యం చేసేలా ఉండకూడదని హితవు పలికారు. 2004లో శాసనమండలి వల్ల ఖర్చు తప్ప ఏం ప్రయోజనం ఉండదన్న చంద్రబాబు... ఇవాళ పెద్దల సభ ఉండాలనడం విడ్డూరంగా ఉందన్నారు.
గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు: రోజా
అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే రోజా