ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విజ్ఞాన గిరిపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రీ వళ్లి, దేవసేన సమేతుడై న సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తులు కొలువుదీరి శ్రీ నారద పుష్కరిణిలో తెప్పలపై విహరించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం భక్తి ప్రపక్తులతో జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కుమార స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పుష్కరిణి హర నామస్మరణలతో మార్మోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యస్వామి తెప్పోత్సవం - aadi kruthika
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యస్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈవేడుకను నిర్వహించారు.
కార్తికేయ