ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే నిధుల దుర్వినియోగం సరికాదు: కన్నా

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని బాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తిరుపతి సమీపంలోని అవిలాల చెరువులో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అవిలాల చెరువును పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Jul 19, 2019, 12:46 PM IST

అవిలాల చెరువును పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ

నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతి సమీపంలోని అవిలాల చెరువులో తితిదే నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవన పనులను ఆయన పరిశీలించారు. ధర్మపరిరక్షణకు వినియోగించాల్సిన తితిదే నిధులను ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో నీటి ఎద్దడి నివారణకు అవిలాల చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కన్నా అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో సుప్రీం కోర్టు ఆదేశాలను అవిలాల చెరువులోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details