తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Justice NV Ramana) దర్శించుకున్నారు. జస్టిస్ రమణ దంపతులకు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని సుబ్బారెడ్డి అందించారు.
Justice NV Ramana: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు - Justice NV Ramana updates
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Justice NV Ramana).. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. జస్టిస్ రమణ దంపతులకు స్వాగతం పలికిన అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు
అంతకముందు ఎన్వీ రమణ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. బేడీ ఆంజనేయస్వామి సేవలో పాల్గొన్నారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు.
ఇదీ చదవండి