వినూత్న రీతిలో జూడాల నిరసన - junior doctors
తిరుపతిలో జూడాలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు. బిల్లు వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరిస్తూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో....జూనియర్ వైద్యులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. బ్రిడ్జి కోర్సు ద్వారా ఎంబీబీఎస్ చదవని వైద్యులు.....ప్రజలకు చికిత్స చేయటం మొదలు పెడితే వచ్చే నష్టాలను కళ్లకు కడుతూ ప్రదర్శనలు నిర్వహించారు. విశ్వవిద్యాలయాల కేంద్రమైన తిరుపతిలో వైద్య విద్యార్థులంతా ఏకమై వైద్యులతో కలిసి వస్తే....ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు జూడాలు తెలిపారు.