ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాల పేరిట మోసం.. లక్షలు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

మూడు జిల్లాల్లో మహిళలు, నిరుద్యోగులను బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విమానాశ్రయం, ఎయిర్ ఫోర్స్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్న.. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంకు చెందిన బండి ముత్యాలయ్యన భాకరాపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

cheater arrested in bhakarapeta, police arrested jobs cheater at bhakarapeta
నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తి భాకరాపేటలో అరెస్ట్, మహిళలను బురిడీ కొట్టించే ఘరానా మోసగాడు అరెస్ట్

By

Published : Mar 27, 2021, 7:32 PM IST

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం యండపల్లివారిపల్లికి చెందిన బండి ముత్యాలయ్య అలియాస్ అనిల్ కుమార్ రెడ్డి.. మూడు జిల్లాలోని మహిళలు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు కాజేశాడు. చిత్తూరు, కడప, కర్నూలులో ఇతడిపై చాలా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భాకరాపేట పోలీసులు నిందింతుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మార్ఫింగ్ చేసిన వందలాది మహిళల ఫోటోలు, ద్విచక్రవాహనం, బంగారం, రూ. 70వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిరుద్యోగ యువతీ యువకులకు ఎయిర్ ఫోర్స్, విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ముత్యాలయ్య మాయమాటలు చెప్పేవాడు. అనంతరం బంగారం, నగదు తీసుకుని మోసం చేసేవాడు. మహిళలతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు తీసుకుని.. వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించేవాడు. అలా బలవంతంగా మహిళల వద్ద నుంచి బంగారు నగలతో పాటు లక్షల్లో నగదు కాజేశాడు. మోసపోయిన మరికొందరు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు కోరారు. ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పే అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details