ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం - illegal wine transport in chittoor district updates

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా.. చిత్తూరు జిల్లా పోలీసులు గుర్తించారు. లక్ష రూపాయలు విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు బైరెడ్డిపల్లె ఎస్సై మునిస్వామి వెల్లడించారు.

illegal wine transport
illegal wine transport

By

Published : Jul 29, 2020, 4:09 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని బైరెడ్డిపల్లె ఎస్సై మునిస్వామి తెలిపారు. కైగల్ వంతెన వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అయిదుగురు వ్యక్తులు, ఒక కారు, రెండు ప్యాసింజర్ ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలలో కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గుర్తించినట్లు వివరించారు. వారిని అదుపులోకి తీసుకొని మద్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.లక్ష ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details