చిత్తూరు జిల్లా తిరుపతి - రేణిగుంట జాతీయ రహదారిపై రేణిగుంట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 40 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని గాజులమండ్యం పోలీసులు కేఎల్ఎం హాస్పిటల్ కూడలిలో నిర్వహిస్తుండగా ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనంలోని వ్యక్తి పోలీసులను గమనించి వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాన్ని గమనించిన పోలీసులు వాహనంలో ఎర్రచందనం దుంగలు వున్నట్లు గుర్తించారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే జిల్లాలోని పుత్తూరు మూల కోన వద్ద అటవీ శాఖ అధికారులు దాడుల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. సుమారు 570 కేజీలు ఉన్న 40 దుంగల విలువ 15 లక్షలు ఉంటుందని పోలీసుల తెలిపారు. డ్రైవర్‌తో పాటు మరో ఐదుగురు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలుపగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లా తిరుపతి - రేణిగుంట జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూత్తూరులోనూ 40 దుంగలు అటవీశాఖ అధికారులకు పట్టుబడగా.. కేసు నమోదు చేశారు.
15 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం