చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం ఎస్ఎల్పురం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ సిబ్బందిని తనిఖీలు చేశారు. ఈ సోదాలో లారీతో సహా 138 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా ఓ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
కేవీబీపురం అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం - news updates in chithore distric
చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో టాస్క్ఫోర్స్ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కేవీబీపురం అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం